ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పుట్లగట్లగూడెం శివారులో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తలభాగం ఛిద్రం కావడంతో గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందాల్సి ఉంది.