కామవరపుకోట మండలం ఆడమిల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం జాబ్ మేళా నిర్వహించారు. ఈ మేళాలో 112 మంది యువతీ, యువకులు ఇంటర్వ్యూలకు హాజరు కాగా, 54 మందిని వివిధ కొలువులకు ఎంపిక చేసినట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ జాబ్ మేళాలో మొత్తం 17 కంపెనీలు పాల్గొన్నాయి.