ముత్తారెడ్డిని కలిసిన కోనేరు: పార్టీకి సేవకు గుర్తింపుపై ఆశాభావం

550చూసినవారు
ముత్తారెడ్డిని కలిసిన కోనేరు: పార్టీకి సేవకు గుర్తింపుపై ఆశాభావం
ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల నియామకం పొందిన జగ్గవరపు ముత్తారెడ్డిని కామవరపుకోట పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కోనేరు వెంకటరామయ్య (బుజ్జి గారు) కలిసి అభినందించారు. ముత్తారెడ్డి పార్టీకి 43 ఏళ్లుగా కష్టపడి పనిచేస్తున్నారని, ఆయనకు రాష్ట్ర స్థాయి పదవి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆయనకు ఇప్పుడు ఇచ్చిన ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పదవికి కూడా వన్నె తెస్తారని బుజ్జి గారు తెలిపారు. ఈ సందర్భంగా నెక్కలపు గంగాధర్ రావు, అట్లూరి శ్రీనివాసరావు కూడా ముత్తారెడ్డిని కలిశారు. ముత్తారెడ్డి మాట్లాడుతూ, తన సేవకు గుర్తింపు లభించిందని, ప్రాణం ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీకి సేవ చేస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్