లింగపాలెం మండలం ధర్మాజీగూడెం ఎస్ఐ వెంకన్న శుక్రవారం రాత్రి పేకాట శిబిరంపై ఆకస్మిక దాడులు నిర్వహించి, పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి ₹. 6,100 నగదును స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. స్టేషన్ పరిధిలో జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.