తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి: మండల టీడీపీ అధ్యక్షులు

10చూసినవారు
తుఫాన్‌పై అప్రమత్తంగా ఉండాలి:  మండల టీడీపీ అధ్యక్షులు
తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జంగారెడ్డిగూడెం మండల టీడీపీ అధ్యక్షులు కుక్కల మాధవరావు గురువారం సూచించారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ తీగల సమీపంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని, పిల్లలను బయటకు పంపకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అధికారులు జారీ చేసే సూచనలు పాటిస్తూ ప్రజలు సురక్షితంగా ఉండాలని మాధవరావు తెలిపారు.

సంబంధిత పోస్ట్