తడికలపూడి ప్రమాద ఘటనపై ఎమ్మెల్యే ఆరా

269చూసినవారు
కామవరపుకోట మండలం తడికలపూడి శివారులో శనివారం కొబ్బరి తోటలో కరెంటు వైర్లు తగిలి లారీ దగ్ధమైన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఎమ్మెల్యే రోషన్ కుమార్, మాజీ ఎమ్మెల్యే గంట మురళి సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద కారణాలను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్