ధర్మాజీగూడెం ఎస్ఐ కె. వెంకన్నకు అందిన సమాచారం మేరకు, ఆయన సిబ్బందితో కలిసి తోచిలక గ్రామంలో పేకాట ఆడుతున్న శిబిరంపై మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 6100 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.