పోలియో చుక్కలు: పెద్దలదే బాధ్యత - టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు

1336చూసినవారు
పోలియో చుక్కలు: పెద్దలదే బాధ్యత - టీడీపీ రూరల్ మండల అధ్యక్షులు
పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం పెద్దలు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షులు చింతం విష్ణు కోరారు. ఆదివారం చింతలపూడి మండలం వెంకటాద్రి గూడెం గ్రామంలో ఆయన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాఘవాపురం పిహెచ్సి డాక్టర్ కిరణ్ చైతన్య మాట్లాడుతూ, పీహెచ్సీ పరిధిలోని 12 సచివాలయాలలో 96% మందికి పోలియో చుక్కలు వేసినట్లు తెలిపారు. ఎర్రగుంటపల్లి పిఎస్సి డాక్టర్ నరేష్ మాట్లాడుతూ, 5013 మందికి గాను 4820 మందికి వేసి 96% పూర్తి చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్