పోలియో చుక్కలు: తల్లిదండ్రుల బాధ్యత - చింతం విష్ణు

398చూసినవారు
పోలియో చుక్కలు: తల్లిదండ్రుల బాధ్యత - చింతం విష్ణు
పిల్లలకు పోలియో చుక్కలు వేయించడం తల్లిదండ్రుల వ్యక్తిగత బాధ్యత అని తెలుగుదేశం పార్టీ రూరల్ మండల అధ్యక్షులు చింతం విష్ణు అన్నారు. ఆదివారం చింతలపూడి మండలం వెంకటాద్రిగూడెం గ్రామంలో ఆయన పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాఘవాపురం పీహెచ్‌సీ డాక్టర్ కిరణ్ చైతన్య మాట్లాడుతూ, తమ పరిధిలోని 12 సచివాలయాలలో 96% మందికి పోలియో చుక్కలు వేశామని, 2694 మందికి గాను 2581 మందికి వేశామని తెలిపారు. ఎర్రగుంటపల్లి పీఎస్సీ డాక్టర్ నరేష్ మాట్లాడుతూ, 5013 మందికి గాను 4820 మందికి వేసి 96% లక్ష్యాన్ని పూర్తి చేశామని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్