వేగవరంలో పల్స్ పోలియో కార్యక్రమం: పిల్లలకు చుక్కలు వేయాలని పిలుపు

935చూసినవారు
వేగవరంలో పల్స్ పోలియో కార్యక్రమం: పిల్లలకు చుక్కలు వేయాలని పిలుపు
జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టీడీపీ అధ్యక్షులు కుక్కల మాధవరావు మాట్లాడుతూ, ఐదేళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని, పోలియో రహిత సమాజం కోసం అందరూ బాధ్యత తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన గ్రామ పార్టీ అధ్యక్షులు అనిశెట్టి శ్రీనివాస్, ఎంపీటీసీ కుక్కల సత్యనారాయణ, ఆరోగ్య సిబ్బంది, కూటమి నాయకులు పాల్గొన్నారు. వారు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.

సంబంధిత పోస్ట్