ఏలూరు జిల్లా వ్యాప్తంగా ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జంగారెడ్డిగూడెం పట్టణంలోని రామాలయం సెంటర్ వద్ద జోకర్ వేషధారణతో చిన్నారులను ఆకట్టుకునేలా కార్యక్రమాన్ని నిర్వహించారు. పల్స్ పోలియో చుక్కలు వేయించుకోవడానికి వచ్చే చిన్నారులు తమ ఆధార్ కార్డును తప్పనిసరిగా తీసుకురావాలని ఏఎన్ఎం శశికళ, ఆశ వర్కర్లు తెలిపారు.