ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఎస్సీ ఎస్టీలపై దౌర్జన్యాల నియంత్రణకు సంబంధించి కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం బుధవారం జరిగింది. ఈ సమావేశంలో సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా స్థాయి అధికారులు, చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సోంగా రోషన్ కుమార్, నూతనంగా ఎన్నికైన ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మోనిటరింగ్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కామవరపుకోటకు చెందిన సభ్యుడు కె.ప్రభాకరరావు కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేశారు.