చింతలపూడిలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ ముఠా అరెస్ట్

587చూసినవారు
చింతలపూడిలో ట్రాన్స్‌ఫార్మర్ చోరీ ముఠా అరెస్ట్
చింతలపూడి పరిధిలో ట్రాన్స్‌ఫార్మర్లను పగులగొట్టి రాగి వైరు దొంగిలిస్తున్న ముఠాను పోలీసులు ఆదివారం పట్టుకున్నారు. మొత్తం నలుగురు నిందితులు మరియు ఒక మైనర్‌ను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి 10 కేసులకు సంబంధించిన 19 ట్రాన్స్‌ఫార్మర్లలో దొంగిలించిన సుమారు 160 కేజీల రాగి వైరు స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్, సీఐ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్