
నీటి బకెట్లో పడి 16 నెలల చిన్నారి మృతి
TG: హైదరాబాద్లోని కంచన్బాగ్ ప్రాంతంలో 16 నెలల చిన్నారి ప్రమాదవశాత్తు నీటి బకెట్లో పడి మృతి చెందింది. అర్ధరాత్రి ఇంటికి చేరుకున్న కుటుంబం పనుల్లో నిమగ్నమై ఉండగా, ఆడుకుంటున్న చిన్నారి బకెట్లో పడిపోయింది. బకెట్లో కనిపించిన చిన్నారిని ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.




