
దెందులూరు: పేదవాడు సంక్షేమానికి అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి
దెందులూరు ఎమ్మెల్యే శ్రీ చింతమనేని ప్రభాకర్ ఆదివారం కర్ణాటకలోని బళ్ళారిలో ఎన్టీఆర్ నిత్య అన్నప్రసాద సేవా కార్యక్రమంలో పాల్గొన్నారు. పేదవాడి సంక్షేమానికి స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు చూపిన సేవాస్ఫూర్తి చరిత్రలో చిరస్మరణీయం అని ఆయన అన్నారు. కార్యక్రమంలో స్వయంగా భోజనాలు వడ్డించి, ట్రస్ట్ సభ్యులను అభినందించారు.




































