దెందులూరు మండలం సోమవరప్పాడు శివారు వీరభద్రపురం గ్రామానికి చెందిన ముక్కెల్లి నాగరాజు (65) మరియు అతని భార్య
పుష్ప (61) వడదెబ్బతో మంగళవారం మృతి చెందారు. తల్లిదండ్రులు ఒకేరోజు మరణించడంతో వారి కుమారుడు, కుమార్తెలు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషాద సంఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అధికారులు ఈ విషయంపై సమాచారం అందుకున్నారు.