దెందులూరు మండలం శ్రీరామవరం గ్రామంలో శుక్రవారం రాత్రి వైసీపీ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏలూరు జిల్లా వైసీపీ యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని పాల్గొని, గ్రామ కమిటీ అధ్యక్షులుగా అక్కినేని గోవర్ధన్ ను నియమించారు. పోలీసులు ఈ సమావేశాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, వైసీపీ కార్యకర్తలు తమ అభిమానంతో పోలీసుల అడ్డంకులను లెక్కచేయకుండా సమావేశాన్ని కొనసాగించారు.