దెందులూరు మండలంలో ఐదుగురు అరెస్ట్

66చూసినవారు
దెందులూరు మండలంలో ఐదుగురు అరెస్ట్
దెందులూరు మండలం కొమిరేపల్లిలో కోడిపందాల శిబిరంపై ఆదివారం రాత్రి పోలీసులు దాడి చేసి ఐదుగురిని అరెస్టు చేశారు. గ్రామంలో కోడిపందాలు జరుగుతున్నాయని అందిన సమాచారం మేరకు పోలీసులు ఈ దాడి నిర్వహించారు. పారిపోవడానికి ప్రయత్నించిన వారిలో ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 2, 230 నగదు, ఒక కోడి, కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై ఎస్ఐ శివాజీ వివరాలు వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్