పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మండలం పెదపాలెం పాఠశాల హెచ్‌ఎం భవ్య శిరీష విద్యార్థులకు వినూత్నంగా స్వాగతం పలికి గ్రామస్తులను ఆకట్టుకున్నారు. పాఠశాల పునఃప్రారంభం సందర్భంగా 'మనబడి - మన పండుగ' కార్యక్రమంలో భాగంగా, ఆమె సాంప్రదాయ పద్ధతిలో విద్యార్థులను తరగతి గదిలోకి ఆహ్వానించి, తల్లిదండ్రులతో ఆశీర్వచనాలు అందించారు. గత ఏడాది 1, 2 తరగతుల్లో కేవలం 5 మంది విద్యార్థులున్న పాఠశాలలో ఈ ఏడాది 19 మందికి చేరడం విశేషం. ఈ కార్యక్రమంలో పాఠశాల, అంగన్వాడీ సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.