కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు: 2029 నాటికి దేశాన్ని నిర్మూలించాలని లక్ష్యం

170చూసినవారు
కుష్టు వ్యాధిపై అవగాహన సదస్సు: 2029 నాటికి దేశాన్ని నిర్మూలించాలని లక్ష్యం
జిల్లా దివ్యాంగుల పునరావాస కేంద్రం, ఏలూరు వారు శుక్రవారం వేగవరం, దెందులూరు మండలం డామియన్ లేప్రోసి సెంటర్ నందు కుష్టు వ్యాధిపై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా డిస్టిక్ లెప్రసీ, టీబీ అండ్ హెచ్ఐవి ప్రాజెక్ట్ ఆఫీసర్ డా. ఎన్. లక్ష్మీనారాయణ, డా. వై.ఎస్. చక్రధర్, డామియన్ లేప్రోసి సెంటర్ సిస్టర్ రోషిని పాల్గొన్నారు. డా. ఎన్. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, 2029 సంవత్సరానికి కుష్టు వ్యాధి రహితంగా భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి అందరూ కృషి చేయాలని సూచించారు. కో ఆర్డినేటర్ శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, కుష్టు వ్యాధి నయం చేయగలమని, నిజమైన సవాలు కళంకం అనేది ఈ సంవత్సరం యొక్క థీమ్ అని తెలిపారు. ప్రపంచ లేప్రోసి డే సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమం జరిగింది.

సంబంధిత పోస్ట్