కారుమూరిపై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తీవ్ర విమర్శలు

620చూసినవారు
కారుమూరిపై ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ తీవ్ర విమర్శలు
తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మాజీ మంత్రి కారుమూరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. అసత్య ప్రచారాలు, అరాచకాల రాజకీయ చరిత్ర కలిగిన కారుమూరికి కూటమి ప్రభుత్వంపై విమర్శలు చేసే స్థాయి లేదని ఆయన అన్నారు. శనివారం కూటమి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న కూటమి ప్రభుత్వంపై కారుమూరి బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, గత ఎన్నికల్లో ప్రజలు వారిని తరిమి కొట్టారని గుర్తు చేశారు. ట్రాఫిక్ నియంత్రణలో భాగంగానే తణుకు పట్టణ ప్రణాళిక చేశామని, టీడీఆర్ బాండ్స్ దేశవ్యాప్తంగా జరిగే ప్రక్రియ అని తెలిపారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవాలని కారుమూరికి సవాల్ విసిరారు.

సంబంధిత పోస్ట్