పెదవేగి: నేడు విద్యుత్ సరఫరాలో మార్పులు

602చూసినవారు
పెదవేగి: నేడు విద్యుత్ సరఫరాలో మార్పులు
పెదవేగి మండలం తాళ్లగోకవరం విద్యుత్ కేంద్రం పరిధిలో శుక్రవారం రెండు విడతలుగా వ్యవసాయ విద్యుత్ సరఫరా చేయనున్నట్లు ఈఈ అంబేడ్కర్ తెలిపారు. విద్యుత్ తీగల మరమ్మతుల కారణంగా ఉదయం 5 నుంచి 9 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే విద్యుత్ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. రైతులు ఈ మార్పును గమనించి సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్