పెదవేగి: కోడి పందేల బరులు ధ్వంసం

957చూసినవారు
పెదవేగి: కోడి పందేల బరులు ధ్వంసం
సంక్రాంతి పండుగ సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. శుక్రవారం పెదవేగి మండలంలో తహశీల్దార్ భ్రమరాంబిక, ఎస్సై హరిగోపాల్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగం సంయుక్తంగా దాడులు నిర్వహించి, కోడిపందేల కోసం సిద్ధం చేసిన బరీలను, తాత్కాలిక షెడ్లను జేసీబీలు, ట్రాక్టర్ల సహాయంతో ధ్వంసం చేశారు. పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్