దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బుధవారం పెదవేగి మండలం జానంపేటలో నూతనంగా నిర్మిస్తున్న ఆయుర్వేద ఆసుపత్రి భవనానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ ఆధీనంలో కాంట్రాక్టర్లు నిర్మించే భవన నిర్మాణాలను ప్రజలు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, వారి పనితీరును గమనించాలని ప్రజలకు సూచించారు.