పెదవేగి మండలం దుగ్గిరాలలోని ప్రాచీన శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. నూతనంగా నిర్మించనున్న ఆలయ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. భక్తుల అభీష్టం మేరకు రూ. 15 లక్షల నిధులతో ఆలయ అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ప్రాశస్త్యాన్ని కొనియాడారు.