దెందులూరు నియోజకవర్గ వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారు. ఆయన స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించి, పార్టీ జెండాను ఆవిష్కరించారు.