
చింతపల్లి: 'స్మశానానికి దారి చూపండి'
ముసునూరు మండలం చింతలవల్లిలో స్మశానం పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలతో నిండిపోయిందని, దీంతో అంతిమ సంస్కారాలకు వెళ్లడానికి దారి లేక స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. పిచ్చి మొక్కలను తొలగించి, స్మశానం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించాలని గ్రామస్థులు కోరుతున్నారు.



































