పేరుపాలెం పరిసర ప్రాంతాల్లో గత 5 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు అన్నదాతలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. పల్లపు భూములు జలమయం కావడంతో పంట పొలాల్లోకి నీరు చేరి వ్యవసాయ పనులు నిలిచిపోయాయి. ప్రస్తుతం కోబ్బరి, వరి, కూరగాయల పంటలు సాగు చేస్తున్న రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పొలాల్లోకి వెళ్లే అవకాశం లేక యంత్రాలను నిలిపివేయాల్సి వచ్చింది. అయితే, కొందరు గ్రామస్తులు భూగర్భ జలాలు పెరుగుతాయనే ఆనందం వ్యక్తం చేస్తున్నారు.