రైలింగ్ లేక ప్రమాదభరితంగా మారిన వంతెన

158చూసినవారు
రైలింగ్ లేక ప్రమాదభరితంగా మారిన వంతెన
ఉంగుటూరులోని నాచుగుంట వద్ద ఏలూరు ప్రధాన కాలువపై ఉన్న వంతెనకు ఒక చోట రైలింగ్ లేకపోవడంతో ప్రమాదకరంగా మారింది. ఈ రహదారి గుండా నిత్యం పలు వాహనాలు రాకపోకలు సాగిస్తుండటంతో, ఆదమరిస్తే కాలువలో బోల్తా పడతారని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రమాదాలు జరగకుండా వెంటనే రైలింగ్ ఏర్పాటు చేయాలని ప్రజలు అధికారులను కోరుతున్నారు.