భీమడోలు మండలం అరుంధతి కాలనీకి చెందిన ఇద్దరు యువకులు మద్యం మత్తులో గ్రామంలో గొడవ చేసి, డయల్ 112కు తప్పుడు సమాచారం ఇచ్చి పోలీసులను తప్పుదోవ పట్టించారు. పోలీసులు వెంటనే స్పందించి విచారణ జరపగా, అది కావాలని చేసిన తప్పుడు కాల్ అని తేలింది. ఇద్దరినీ అదుపులోకి తీసుకుని ఏలూరులోని 2వ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి కె.వి.ఆర్. మహేశ్వరి నిందితులకు 14 రోజుల రిమాండ్ విధించి, అనంతరం వారిని జిల్లా జైలుకు తరలించారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.