పెదపాడు మండలం నాయుడుగూడెంలో అక్కినేని సురేంద్రచౌదరి కుటుంబ సభ్యులు తమ గోవుకు సీమంతం చేశారు. తొమ్మిదో కాన్పుకు సిద్ధంగా ఉన్న గోమాతకు అర్చకులు వేదమంత్రాల మధ్య పసుపు, కుంకుమ రాసి, నూతన వస్త్రాలు సమర్పించారు. అనంతరం గ్రామస్థులు, బంధువులతో కలిసి గోవుకు గిరిప్రదక్షిణలు చేసి, హారతులిచ్చారు. మహిళలకు నిర్వహించే సాంప్రదాయం ప్రకారమే ఈ సీమంతం వేడుకను జరిపారు. గోమాతపై తమకున్న భక్తిని చాటుకునేందుకు ఈ కార్యక్రమం నిర్వహించారు.