ఏలూరు కార్పొరేషన్ అవినీతిపై సమగ్ర విచారణ చేయాలి - ఆర్.సి.పి.ఐ

8చూసినవారు
ఏలూరు కార్పొరేషన్ అవినీతిపై సమగ్ర విచారణ చేయాలి - ఆర్.సి.పి.ఐ
ఏలూరులో భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ (ఆర్.సి.పి.ఐ) నగర సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి పి. కిషోర్ మాట్లాడుతూ, ఏలూరు కార్పొరేషన్ లో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపించారు. ఏడు గ్రామాల విలీనం తర్వాత నివాసాలు, ఆదాయం పెరిగినా, ఖాళీ స్థలాల పన్ను, కాంప్లెక్స్ అద్దెలు, ఇంటి, కులాయి పన్నుల ద్వారా వచ్చే కోట్ల రూపాయల ఆదాయంలో అవినీతి జరుగుతోందని ఆయన అన్నారు. ఈ అవినీతిపై జిల్లా అధికారులు సమగ్ర విచారణ జరపాలని పార్టీ డిమాండ్ చేసింది.

సంబంధిత పోస్ట్