ఏలూరు సర్వజన ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం అదనపు ఓపి కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు సూపర్డెంట్ రాజు తెలిపారు. పురుషుల రిజిస్ట్రేషన్ విభాగంలో 3, మహిళల విభాగంలో 4 కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల ఓపి కోసం క్యూలో నిలబడే సమస్య తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ స్మార్ట్‌ఫోన్‌తో పాటు ABHA గుర్తింపు సంఖ్యను తీసుకురావాలని సూచించారు.