ఏలూరు జిల్లాలో ఈనెల 17 నుంచి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ

198చూసినవారు
ఏలూరు జిల్లాలో ఈనెల 17 నుంచి ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ
జిల్లాలోని 1 నుంచి 19 ఏళ్ల లోపు పిల్లలకు ఈనెల 17 నుంచి 24వ తేదీ వరకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం కలెక్టర్ కార్యాలయంలో మాత్రల పంపిణీ కార్యక్రమంపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆమె, జిల్లా వ్యాప్తంగా 3,73,873 మంది పిల్లలకు మాత్రల పంపిణీకి అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని సూచించారు.