ఏలూరులో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శుక్రవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో సీనియర్ దళిత బహుజన నాయకుడు రమేష్ బాబు అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా, రిటైర్డ్ డిఐజి లంక వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలంతా ఏకతాటిపై ఐక్యంగా ఉండి, రాబోయే స్థానిక ఎన్నికల్లో ఐక్యవేదిక ఆధ్వర్యంలో స్వతంత్రంగా పోటీ చేసి రాజ్యాధికారం సాధించాలని వారు పిలుపునిచ్చారు. ఏలూరు నగర మేయర్ పదవిని బీసీ లేదా ఎస్సీ కులాలకు కేటాయించాలని డిమాండ్ చేశారు.