ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఏలూరులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విత్తన మొక్కజొన్న రైతుల బకాయిలను వెంటనే చెల్లించాలని కోరారు. జులై 3న "హలో రైతన్న–ఛలో ఏలూరు" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.