నూజివీడు పట్టణ ప్రజలకు మున్సిపల్ కమిషనర్ పీరయ్య గురువారంహెచ్చరిక జారీ చేశారు. గత కొద్ది రోజులుగా సైబర్ నేరగాళ్లు ఫోన్ చేసి, తాము మున్సిపల్ ఆఫీస్ నుండి మాట్లాడుతున్నామని, వెంటనే మున్సిపల్ టాక్స్, ట్రేడర్ లైసెన్స్ రుసుము చెల్లించాలని, అందుకు క్యూఆర్ కోడ్ పంపిస్తామని ప్రజలను మోసం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అలాంటి వాటిని నమ్మవద్దని, ఏదైనా సమాచారం కావాలంటే నేరుగా మున్సిపల్ ఆఫీస్‌కు వచ్చి తెలుసుకొని, అక్కడే చలానాలు, టాక్సులు చెల్లించాలని సూచించారు.