బుట్టాయగూడెం మండలంలో అయిదు రోజులుగా సంచరిస్తున్న పెద్దపులి మారుమూరు గ్రామాల్లో మరో రెండు ఆవులను హతమార్చింది. శనివారం పట్టపగలే ఈ దాడి జరిగినట్లు స్థానికులు భావిస్తున్నారు. గొట్టాలరేవు వద్ద గంగిరెడ్డికి చెందిన ఆవు, పూచికగొందిలో కచ్చెల గంగరాజుకు చెందిన ఆవును పులి చంపి, వాగు తొర్రెలోకి లాక్కెళ్లింది. అటవీ శాఖ అధికారులు సాంకేతిక పరికరాలతో పులి కదలికలను పరిశీలిస్తున్నారు. కర్ణాటక నుంచి నిపుణుల బృందాన్ని రప్పించి, పులిని సురక్షితంగా పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ పులి జనవరిలో తెలంగాణ నుంచి రాష్ట్ర సరిహద్దులోకి ప్రవేశించి, ప్రస్తుతం కామవరం అడవిలోకి ప్రవేశించడంతో తిరుగు ప్రయాణం పట్టి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.