పోలవరం నియోజకవర్గ అబ్జర్వర్‌గా బీవీఆర్ చౌదరిని నియమించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్‌చార్జ్ మల్లేలా చంటి నాయుడు ఆయనను సోమవారం కలిసి శుభాకాంక్షలు తెలిపారు. బీవీఆర్ చౌదరి తన అనుభవం, నాయకత్వంతో 2029 ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఘన విజయం కోసం కృషి చేస్తారని చంటి నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతానికి ఆయన అంకితభావంతో పనిచేస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశం స్నేహపూర్వక వాతావరణంలో జరిగింది.