ఏలూరులోని లింగారిగూడెం-మాదేపల్లి రోడ్డు మార్గంలో బుధవారం కారు ప్రమాదం చోటుచేసుకుంది. కైకలూరు నుంచి ఏలూరు వస్తుండగా అతివేగం కారణంగా కారు అదుపుతప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అతన్ని చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.