చాట్రాయి: కరెంట్ షాక్‌తో పాడి గేదెల మృతి

3చూసినవారు
చాట్రాయి: కరెంట్ షాక్‌తో పాడి గేదెల మృతి
చాట్రాయి మండలం పర్వతాపురంలో విద్యుత్ షాక్ కారణంగా రెండు పాడి గేదెలు మృతి చెందాయి. గ్రామంలోని ఓ రైతు పొలంలో వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ త్రిఫేస్ వైర్లు తెగి కింద పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. నిర్లక్ష్యంగా వదిలేసిన వైర్ల వల్ల సొప్పరపు నరసింహారావు, ఆముదాల వెంకటేశ్వరరావులకు చెందిన గేదెలు విద్యుత్ షాక్‌కు గురై మరణించాయి. రైతులు తమ గేదెల విలువ సుమారు లక్ష రూపాయలకు పైగా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్