ఏలూరులో జై భీమ్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన దళిత క్రైస్తవ శంఖారావం సభలో
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై వ్యంగ్యంగా మాట్లాడటాన్ని ఏలూరు నియోజకవర్గ
జనసేన పార్టీ ఇంచార్జీ రెడ్డి అప్పలనాయుడు ఖండించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం పవన్ కళ్యాణ్ గారిని లక్ష్యంగా చేసుకుని, ఆయనపై వ్యంగ్యంగా మాట్లాడటాన్ని మానుకోవాలని అన్నారు. ఈ సంఘటన ఏలూరులో నిన్న జరిగిన సభలో చోటుచేసుకుంది.