దుగ్గిరాల ఫై ఓవర్‌పై ఓ వృద్ధుడి మృతదేహం కలకలం రేపింది. సమాచారం అందుకున్న 3 టౌన్ పోలీసులు అతన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి వద్ద ఎటువంటి వివరాలు లభించలేదని, వివరాలు తెలిసినవారు ఏలూరు త్రీ టౌన్ పోలీసు స్టేషన్‌ను సంప్రదించాలని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీలో భద్రపరిచారు.