ఇంటి నిర్మాణ దరఖాస్తుల గడువు డిసెంబర్ 14 వరకు పొడిగింపు

518చూసినవారు
ఇంటి నిర్మాణ దరఖాస్తుల గడువు డిసెంబర్ 14 వరకు పొడిగింపు
ఏలూరు జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన దరఖాస్తుల గడువు పొడిగించామని జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి సత్యనారాయణ తెలిపారు. ఆవాస్ ప్లస్ 2024 సర్వేను పూర్తి చేయడానికి కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ డిసెంబర్ 14 వరకు అదనంగా సమయం ఇచ్చిందని చెప్పారు. స్థలం ఉన్నప్పటికీ ఇల్లు లేని అర్హులైన కుటుంబాలు ఈ అవకాశం కోల్పోకుండా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్