లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్

2499చూసినవారు
లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ డిప్యూటీ తహశీల్దార్
జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టెక్కినవారిగూడెంకు చెందిన రైతు పోతన సుకుమార్ నుంచి డిప్యూటీ తహసీల్దార్ వెంకటేశ్వరరావు రూ.50 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు.. గురువారం రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా డిప్యూటీ తహశీల్దార్‌ను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్