రైతు అవసరాలకే డీజిల్ ప్రాధాన్యం: కలెక్టర్

793చూసినవారు
రైతు అవసరాలకే డీజిల్ ప్రాధాన్యం: కలెక్టర్
జిల్లాలో డీజిల్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, రైతుల అవసరాలకే తొలి ప్రాధాన్యమివ్వాలని కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. ఏలూరులో టెలికాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. డీజిల్ ఇతర ప్రాంతాలకు తరలకుండా నిఘా పెట్టాలన్నారు. వరి కోత యంత్రాలు, ఆక్వా రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని, కొరతపై ఆందోళన చెంది ప్రజలు నిల్వ చేసుకోవద్దని సూచించారు. అధిక డిమాండ్ ఉన్న బంకులకు ట్యాంకర్లు పంపాలని ఆదేశించారు.