ఏలూరు జిల్లాలో మొత్తం 3,73,873 మంది పిల్లలకు నులిపురుగుల నివారణ టాబ్లెట్స్ అందించామని కలెక్టర్ వెట్రిసెల్వి గురువారం తెలిపారు. జిల్లాలోని 2,221 అంగన్వాడీ కేంద్రాలలోని 70,625 మంది పిల్లలకు, 2,404 స్కూల్స్ లోని 2,55,207 మంది విద్యార్థులకు, 184 కాలేజీలలోని 46,281 మంది యువతకు, 1,760 మంది చిన్నారులకు నులిపురుగుల నివారణ మాత్రలు అందించామని వివరించారు.