వైద్యుల నిర్లక్ష్యం.. ఒకేరోజు మహిళకు రెండుసార్లు ఆపరేషన్

2446చూసినవారు
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం కలకలం రేపింది. గర్భసంచి వ్యాధితో చేరిన కనకరత్నం అనే మహిళకు ఒకే రోజు రెండుసార్లు శస్త్రచికిత్స చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధితురాలిని మరో 4 వారాలు ఆసుపత్రిలోనే ఉంచాలని వైద్యులు చెప్పడంతో వారు ఆందోళనకు దిగారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని ఈ ఘటనపై తక్షణమే సమగ్ర విచారణ జరిపి, బాధ్యులైన వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్