ఏలూరు జిల్లా నూజివీడు పట్టణంలో స్థానిక బస్టాండ్ ఎదురుగా ఉన్న రోడ్డులో డ్రైనేజీ పూడిక పనులు గురువారం వేగవంతం చేశారు. వర్షాకాలంలో డ్రైన్లలో చెత్త పేరుకుపోయి రోడ్లపైకి వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు చర్యగా ఈ పనులు చేపట్టారు. బస్టాండ్ సెంటర్ నుండి నెహ్రూపేట వెళ్లే దారి వెంబడి డ్రైనేజీని శుభ్రం చేశారు.