ఏలూరు మండలం మాదేపల్లికి చెందిన 84 ఏళ్ల మారిశెట్టి రాజ్యలక్ష్మి శుక్రవారం ఇంట్లో గ్యాస్ స్టవ్ వెలిగిస్తుండగా, అగ్గిపుల్ల ఆర్పకుండా పడేయడంతో ప్రమాదవశాత్తు చీరకు నిప్పు అంటుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను కుటుంబ సభ్యులు మొదట సర్వజన ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం విజయవాడకు తరలించారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆమె మృతి చెందారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.